25.4 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

నాభర్తకు ప్రాణహాని ఉంది… వంశీ భార్య పంకజశ్రీ

గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉన్నట్లు ఆయన సతీమణి పంకజశ్రీ సంచలన ఆరోపణ చేశారు. శనివారం ఆమె విజయవాడ సబ్‌ జైలులో వల్లభనేని వంశీతో అతని భార్య పంకజశ్రీ ములాఖాత్‌ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు విజయవాడ సబ్‌జైలులోనే ప్రాణహాని ఉందని తీవ్రమైన ఆరోపణ చేశారు. తన భర్తను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, ఆయన వెన్నునొప్పితో భాధపడుతున్నారని పంకజశ్రీ తెలిపారు. నా భర్తను మానసికంగా కుంగదీస్తు్న్నారని, వంశీ ఉన్న బ్యారక్‌లో 60 సీసీ కెమెరాలు పెట్టారని పంకజశ్రీ చెప్పారు. వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగా ఉన్నట్లు వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వంశీ విషయంలో వైద్యులు ఇస్తున్న తప్పుడు వైద్య నివేదికలపై కోర్టుకు వెళతామని పంకజశ్రీ తెలియజేశారు. కేవంలం 20వేల కోసం తప్పడు కేసులు పెట్టి వంశీని టార్చర్‌ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఫోన్‌ చేసి పరామర్శించారని, ధైర్యంగా ఉండాలని చెప్పారని వంశీ సతీమణీ పంకజశ్రీ తెలిపారు. వచ్చేవారం వంశీని కలుస్తానని జగన్‌ చెప్పినట్లు పంకజశ్రీ పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com