- ఇప్పటి వరకూ 50 కోట్ల మంది స్నానాలు
- ఇది అమెరికా, రష్యా దేశాల జనాభాకంటే ఎక్కువ
- నిన్న ఒక్కరోజే 92 లక్షలమంది స్నానాలు
- రోడ్లపై ఇసకేస్తే రాలనంత జనం
- రైళ్లు,బస్సులు,టెంపోలలో కిక్కిరిసిన రద్దీ
- కిలోమీటర్ల మేర ట్రాఫిక జామ్స్
- రద్దీని డీల్ చేయలేక ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ మూసివేత
- కుంభమేళా వ్యవధి పొడిగించాలని అఖిలేష్ సూచన
- గతలో75 రోజుల పాటు నిర్వహణ
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా మహోధృతంగా సాగిపోతోంది. జనప్రవాహం అలా నిరంతర గంగా ప్రవాహంలా సాగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య అక్షరాల 92 లక్షలు.దీంతో ఇప్పటి వరకూ కుంభమేళా సందర్శించిన వారి సంఖ్య 50 కోట్లు దాటిపోయింది. మామూలుగా అయితే మేళా ముగిసేనాటికి 45 కోట్ల మంది లెక్క తేలతారని అధికార వర్గాలు భావించాయి.కానీ ఊహకు భిన్నంగా ఇంకా పది రోజులుండగానే 50 కోట్ల మంది మేళాలో స్నానాదులు, పూజలు పూర్తి చేసుకున్నట్లు లెక్క తేలింది. మహాకుంభమేళా ఇంత విజయవంతం అవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకూ 50 కోట్ల మంది మునిగారంటే ఇది అమెరికా, రష్యా దేశాల జనాభా కలిపి చూసినా అంతకన్నా ఎక్కువే.
మహా కుంభమేళాను పొడిగించండి…
మహా కుంభమేళా వ్యవధిని మరింత పొడిగించాలని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళాకు రావాలని ఇంకా చాలా మంది తపన పడుతున్నారని, ప్రయాగ్ రాజ్ లో ఎక్కడ చూసినా జన సంద్రమే కనిపిస్తోందని అన్నారు. రోడ్లపై ఇంకా నిలిచి ఉన్నారని, వారంతా కూడా పవిత్ర స్నానాల కోసం వేచి చూస్తున్నారని అఖిలేష్ అన్నారు.గతంలో కుంభమేళాను 75 రోజులు నిర్వహించామని, కానీ ఇప్పుడు చాలా తక్కువ వ్యవధి పెట్టారని అన్నారు.ఇంకా లక్షలాది మంది కుంభమేళాకు రావాలని తహతహలాడుతున్నారని అన్నారు.ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల రోడ్లన్నీ ఇసకేస్తే రాలనంతగా జన సమూహంతో నిండిపోయాయని, కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలే కనిపిస్తున్నాయని అఖిలేష్ అన్నారు. రద్దీ తట్టుకోలేక ఇటీవల ప్రయాగ్ రాజ్ సంగమ్ రైల్వేస్టేషన్ ను ఇటీవల మూసివేశారు. మొన్నటి తొక్కిసలాటలో మృతుల సంఖ్యను కూడా దాచిపెట్టారని అఖిలేష్ ఆరోపించారు.
జనసంద్రంతో ప్రయాగ్ రాజ్
రైళ్లు బస్సులు, వాహనాలు,కిటకిటలాడిపోతున్నాయని, సోషల్ మీడియా చూస్తే ఆ రద్దీ ఎంత ఉందో అర్ధమవుతుందనీ అన్నారు. రిజర్వేషన్లను సైతం ఖాతరు చేయకుండా జనం రవాణా సదుపాయాలను ఆశ్రయిస్తున్నారని, వారి తహతహ లేదా ఆతృత పడటం చూస్తుంటే కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని అఖిలేష్ అన్నారు. ప్రపంచంలోకే అతిపెద్ద ఆధ్యాత్మిక సమూహంగా మహాకుంభమేళా ప్రసిద్ధి కెక్కింది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినం నాడు ముగియనుంది.