హీరోయిన్ పూజా హెగ్దే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బుట్టబొమ్మ 1990లో జన్మించింది. తుళు తెగకు చెందిన ఈమె తుళు భాష మాట్లాడుతుంది. కర్ణాటక నుంచి వచ్చిన స్టార్ హీరోయిన్లలో అధిక శాతం తుళు తెగకు చెందిన వారు కావటం గమనార్హం. మల్లె తీగ నడుముతో పూజ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కామర్స్ లో డిగ్రీ చేసిన ఈ అమ్మడి విద్యాబ్యాసం అంతా ముంబైలో సాగింది. 2009లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా తొలి దశలోనే ఎలిమినేట్ అయింది.
కాలేజీలో చదివేటపుడు తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో పూజ సహాయపడుతుండేది. దాంతో ఆమెకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది.
2010లో మరోసారి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఆ సమయంలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చినా కథ నచ్చక దూరంగా ఉన్న సొగసరి.. తల్లి ఒత్తిడితో 2012లో తమిళంలో ముగమూడి అనే సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించింది.
2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016లో మొహంజదారో హిందీ సినిమాలో నటించినా అంతగా పేరు రాలేదు.
టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో జత కట్టిన పూజ… మహేష్ బాబుతో ‘మహర్షి’, ప్రభాస్తో ‘రాధే శ్యామ్’, ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’, అల్లు అర్జున్తో ‘అల వైకుంఠపురం’ సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగు పరిశ్రమలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే… అనుహ్యంగా కనుమరుగైంది.
‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.
బాలీవుడ్లో షాహిద్ కపూర్ తో కలిసి ‘దేవా’ సినిమాలో నటించిన పూజా హెగ్డే …. హీరోతో లిప్ లాక్ చేసి పాపులారిటీ సాధించింది.
ఊహించని విధంగా మళ్లీ రేసులోకి వచ్చిన పూజ తమిళ హీరో సూర్యతో రెట్రో సినిమాలో చేస్తోంది. వచ్చే మేలో విడుదల కానుంది. ఈ ఏడాది రెండు తమిళం మరో రెండు హిందీ సినిమాలు చేస్తోంది.
courtesy: instagram