- స్పేస్, రవాణా,టెక్నాలజీ, పరిశోధనల రంగాలపై చర్చ
- పరస్పరం భాగస్వామ్యంతో పనిచేయాని నిర్ణయం
- కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ, ఎంటర్ ప్రిన్యుయర్ షిప్, గుడ్ గవర్నెన్స్
- భారత్ కు ఉన్న అవకాశాలపై మోడీ చర్చలు
- మస్క్ పిల్లలకు పుస్తకాలు బహుకరించిన మోడీ
- ప్రధాన ఆకర్షణగా మస్క్ సహచరి
- షివాన్ జిల్స్ లో భారతీయ మూలాలు
ప్రపంచ బిలియనీర్, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తో ప్రధాని మోడీ వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ట్రంప్ తో భేటీకి ముందు వీరిద్దరూ కలసి అనేక అంశాలపై చర్చలు జరిపారు.స్పేస్, రవాణా,టెక్నాలజీ, పరిశోధనల రంగాలలో వీరిద్దరూ చర్చలు జరిపారు. భారత, అమెరికా భాగస్వామ్య కంపెనీలు రిసెర్చ్,ఖగోళాన్వేషణ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,సుస్థిర పురోగతి రంగాలలో సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకోవాలని నిర్ణయించారరు.కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ, ఎంటర్ ప్రిన్యుయర్ షిప్, గుడ్ గవర్నెన్స్ రంగాల్లో మరింత లోతుగా సంఘటితంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఇద్దరూ అంగీకరించారు.
పుస్తకాలు బహుకరించిన మోడీ
అంతకుముందు బ్లెయిర్ హౌస్ లోమోడీని మస్క్ కలసినప్పుడు ఆయన పిల్లలకు మూడు పుస్తకాలను మోడీ అందచేశారు.విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన నోబెల్ క్రిసెంట్, ఆర్కే నారాయణన్ కథల పుస్తకం,పండిట్ విష్ణు శర్మ రాసిన పంచతంత్రం సంపుటిని మస్క్ పిల్లలకు మోడీ బహూకరించారు. మోడీతో భేటీకి మస్క్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.మస్క్ తో భేటి, ఆయనతో జరిపిన చర్చలు మరింత ఆశాజనకంగా ఉన్నాంటూ మోడీ ఎక్స్ ఖాతాలో ఆపై ట్వీట్ చేశారు.
మస్క్ సహచరిలో భారత మూలాలు
మోడీ భేటికి తన భాగస్వామి షివాన్ జిల్ తో, తన ముగ్గురుపిల్లలతో కలసి ఎలన్ మస్క్ వచ్చారు. యేల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన షివాన్ జిల్స్ తల్లి శారత భారతీయురాలే కాగా తండ్రి రిచర్డ్ జిల్స్ కెనేడియన్. ఆమె మస్క్ ప్రారంభించిన న్యూరా లింక్స్ కు డైరక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ స్పెషల్ ప్రాజెక్ట్స్ విభాగం డీల్ చేశారు. 2017-2019 మధ్య కాలంలో జిల్స్ టెస్లా కంపెనీ ప్రాజెక్ట్ డైరక్టర్ గా పనిచేశారు. శామ్ ఆల్ట్ మెన్ ఓపెన్ ఏఐ కి సలహాదారు, బ్లూం బర్గ్ బెటా కంపెనీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. ఫోర్బ్స్ అండర్ 30 వెంచర్ క్యాపిటలిస్ట్స్ జాబితాలోనూ షివాన్ జిల్స్ కు స్థానం దక్కింది. లింక్డిన్స్ 35 జాబితాలో కూడా 35వ వ్యక్తిగా స్థానం ఉంది. ప్రస్తుతం మస్క్ జీవన భాగస్వామిగా ఉన్న షివాన్ జిల్స్ కు ముగ్గురు సంతానం. అజుర్, స్ట్రైడర్, ఎక్స్ వారి పేర్లు. వీరిలో ఎక్స్ చాలా చిన్నవాడు. వీరిద్దరి బంధాన్ని బాహాటంగా ప్రకటించనప్పటికీ టెక్సాస్ లో ఉన్న మస్క్ సొంతింటిలోనే ఉంటోంది. గతంలో మస్క్ కు వేర్వేరు వివాహాల ద్వారా 11 మంది సంతానం ఉన్నారు.