సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
హరీష్ రావు కామెంట్స్……
డంపింగ్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయకండి అంటే మొండిగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం
పర్యావరణం దెబ్బతింటది. నర్సాపుర్ చెరువు కలుషితం అవుతుంది, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి.
ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తున్నది. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నడు.. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నడు. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదు. గుమ్మడిదల అందరికి ఆదర్శం. బంగారం వంటి పంటలు పండిస్తారు.
తక్షణమే డంపు యార్డు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల బూములు గుంజుకున్నడు. న్యాల్కల్ లో పచ్చటి పొలాలు గుంజుకునే ప్రయత్నం చేసాడు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అన్నడు, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నడు. ఊళ్లలో మంది ఎంత మంది ఉంటే అంత మంది పోలీసులను పెట్టిండు. ఓట్లేసిన పాపానికి ప్రజలను మోసం చేసినవు. రుణమాఫీ, రైతు బందు, మహాలక్ష్మి, ఇలా అన్నీ మోసమే.
గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఎయిర్ ఫోర్స్ వాళ్లు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు. అయినా పట్టించుకోవడం లేదు. టిప్పర్లు, పోలీసులను వెనక్కి తీసుకోండి. ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోండి. కళ్లు తెరవకుంటే తగిన శాస్తి తప్పదు, చేతిలో అధికారం ఉందని బలవంతంగా పని చేయకు, రెండుసార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లను హెచ్చరిస్తున్నాం.