27.4 C
Hyderabad
Friday, October 30, 2026

Live Video

spot_img

ఇక అంతా ‘రామ్‌’మయం

  • బిఆర్ఎస్‌లో కీలక మార్పులు.
  • వచ్చేవారం ప్రకటించనున్న కేసీఆర్
  • ఇక పూర్తిస్థాయిలో కేటీఆర్‌కే కీలక బాధ్యతలు
  • పార్టీ నియమావళిలో మార్పులు
  • అధ్యక్షుడిగా కెసిఆర్ ఏ కొనసాగే అవకాశం
  • వర్కింగ్ ప్రెసిడెంట్ కు మరిన్ని అధికారాలు

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారిగా ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్న కెసిఆర్ అనేక విషయాలపై ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరో నాలుగేళ్ల పాటు ఉద్యమాలు ఆందోళనలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ మొత్తం బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీకి అధ్యక్ష ఎన్నిక కూడా త్వరలో జరగనుంది. ఏప్రిల్ 27 నాటికి టిఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్నిక కూడా జరుగుతుంది. కెసిఆర్ ఈసారి అధ్యక్షుడిగా కొనసాగుతారా లేదా అనే విషయంపై కూడా చర్చ మొదలైంది. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి అనేక ఊహగానాలు పార్టీలో వినిపిస్తున్నాయి. అధ్యక్ష బాధ్యతను కేసీఆర్ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పూర్తిస్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కు అప్పగిస్తూ పార్టీ నియమావళిలో మార్పులు కూడా తీసుకో రానున్నారు.

అవునన్నా కాదన్నా పార్టీలో ప్రస్తుతం కేటీఆర్ అన్ని చూసుకుంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర కేటీఆర్ పోషిస్తున్నారని నేతలు కూడా అంగీకరిస్తున్నారు. హరీష్ రావు పాత్ర కూడా పార్టీలో కీలకమైనప్పటికీ… నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కేటీఆర్ ది ఫైనల్… ఇప్పటికీ ఇలాంటి విధానమే నడుస్తోంది. రానున్న కాలంలో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు ఈనెల 19న జరిగే సమావేశంలో ప్రకటించనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏడాది కాలంలో కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు లేవు. అసెంబ్లీకి కూడా రావడం లేదు. పూర్తిస్థాయిలో పార్టీ వ్యవహారాలను కేటీఆర్ హరీష్ రావు లే చూసుకుంటున్నారు.

తాను కెసిఆర్ వద్ద పనిచేస్తున్నానని… రేపు కెసిఆర్ మరో నాయకుడు వద్ద పనిచేయాలని ఆదేశిస్తే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే అనేక సందర్భాల్లో హరీష్ రావు ప్రకటించారు. సో ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు అన్ని బాధ్యతలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలిసింది. ఇది ఏకపక్షమైన నిర్ణయము కావద్దని ఉద్దేశంతోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com