ప్రశాంత్ కిషోర్.. ఈ ఎన్ని కల వ్యూహకర్త ప్రస్తుతం బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే సెటిల్ అయ్యారు. కొందరికి రాజకీయ సలహాలు ఇవ్వటం మినాయించి స్ట్రాటజిస్ట్ గా మాత్రం యాక్టివ్ లేరు ప్రశాంత్. ఐతే.. ఇపుడు తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోతుంది. కారణం.. ప్రశాంత్ కిషోర్ విజయ్ భేటీ. టీవీకే పార్టీ పెట్టి సినీ హీరో విజయ్ డీయంకే ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో విమర్శలు సంధిస్తున్నారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడ పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎలక్షన్ కు సమయం తక్కువగా ఉండటంతో స్ట్రాటజిక్ పనులపై విజయ్ దృష్టిపెట్టారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ని పిలిపించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ భేటీతో విజయ్ పార్టీ టీవీకేకి ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నాడని తమిళ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. అసలు విజయ్ ఏరికోరి ప్రశాంత్ కిషోర్ నే ఎందుకు ఎంచుకున్నారు.. ? టీవీకే పార్టీ విషయంలో ప్రశాంత్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది.. ?
తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా పనిచేశాడు. కానీ ఆ తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టి స్ట్రాటజిక్ పనులకు దూరంగా ఉన్నారు. మళ్లీ విజయ్ వల్ల తమిళనాడు పోలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు ప్రశాంత్. విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి బరిలోకి దిగినా సరే.. స్టాలిన్ కి ధీటైన నాయకుడు తమిళనాడులో లేడని ఇప్పటిదాకా అందరూ భావించారు. కానీ.. ఆ ఐడియాలజీని బద్దలు కొట్టేందుకు ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. అందులో భాగంగానే అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మధ్య పొత్తుకి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అన్నాడీఎంకే, టీవీకే పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే.. అది డీఎంకే లాభిస్తుందని కిశోర్ అంచానా వేశారట. అదే జరిగితే.. డీఎంకే పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రశాంత్ తేల్చాశారట. కాబట్టి టీవీకే,అన్నాడీఎంకే పార్టీల పొత్తుపై కసరత్తు చేస్తున్నారట ప్రశాంత్ కిషోర్. అందుకు టీవీకే లీడర్ విజయ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నా డీఎంకే విషయంలో మొదట్నుంచీ విజయ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పార్టీపై పెద్దగా విమర్శలూ గుప్పించలేదు విజయ్. దీన్ని బట్టి చూస్తే.. విజయ్ మనుసులోనే ఆల్ రెడీ ఓ ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పతనం కాబోతుందని ప్రశాంత్ కిషోర్ ముందుగానే జోస్యం చెప్పారు. రిజల్ట్ కూడా అందుకు అనుకూలంగానే వచ్చింది. ఏపీలో ఎన్ డీఏ కూటమి భారీ విజయం సాధించింది. తమిళనాడులో కూడా అన్నాడీఎంకే, టీవికే పార్టీలు కలిస్తే.. అదే రిజల్ట్ వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారట. విజయ్ కూడా అందుకు అణుగణంగా నే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఐతే.. స్టాలిన్ స్టామినాని తక్కువగా అంచనా వేసే అవకాశం మాత్రం లేదు. మరి తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ వేయబోతున్న పొత్తు పాచిక పారుతుందో లేదో వేచిచూడాలి.