గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఆయన నివాశానికి చేరుకున్న విజయవాడ పడమట పోలీసులు వంశీని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నారు. వల్లభనేని వంశీపై బీఎన్‌ఎస్ 140(1), 308, 351(3) రెడ్ విత్ 3(5) సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసుల తెలిపారు. వంశీపై విజయవాడ పడమట పోలీసులు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ మేరకు కేసుల వివరాలనీ రాసిన కాగితాన్ని నోటీసు కింద వంశీ ఇంటి కిటికీకి పోలీసులు అంటించారు. అనంతరం వంశీతో సంబంధిత పత్రాలపై సంతకాలు పెట్టించుకుని అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. అయితే రెండు రోజుల క్రితమే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కార్యాలయ ఉద్యోగి కోర్టులో వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ తన కేసుని వెనక్కి కూడా తీసుకున్నారు. దానికి తోడు ఆ కేసులో వంశీ యాంటిసిపేటరీ బెయిల్ పొంది ఉన్నాడు.
- Advertisement with us -