31.8 C
Hyderabad
Monday, June 15, 2026

Live Video

spot_img

తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా’తల’. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

నటి ఎస్తేర్ మాట్లాడుతూ ” ఈ కథ చాలా బావుంది. రాగిన్ రాజ్ కు మంచి డెబ్యూ అవుతుంది. అమ్మ రాజశేఖర్ గారు ఇతరుల ఫేమ్ ను వాడుకోవాలనుకోలేదు. అందరికీ గుర్తింపు వచ్చే పాత్రలే రాసుకున్నారు. ఎవరికి తగ్గ పాత్రవారికి ఇచ్చాడు. అందరూ హైలెట్ అయ్యేలా చేశారు. ఇది ఇండస్ట్రీలో రేర్ గా కనిపించే లక్షణం. నా పాత్ర నాకే ఛాలెంజింగ్ గా ఉంది. రోహిత్ గారితో వర్క్ చేయడం బావుంది.తల నాకు మంచి జాబ్ శాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను..” అన్నారు.

తల హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. “తల కథ మా నాన్న నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి.ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు..” అన్నాడు.

దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com