26.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

ప్రెసిడెంట్ మస్క్… ట్రంప్ రియాక్షన్ అదుర్స్…

ప్రెసిడెంట్ మస్క్… అదేంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కదా. మరి బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను ప్రెసిడెంట్ అనడం ఏంటనే కదా మీ ప్రశ్న. కానీ మస్క్‌ను ప్రెసిడెంట్ మస్క్ అనే పిలుస్తున్నారు అమెరికాలోని డెమొక్రాట్లు. అయితే ఇదే విషయాన్ని తమ మ్యాగజైన్‌ కవర్‌ స్టోరీగా పబ్లిష్ చేసింది టైమ్స్ మ్యాగజైన్. దీంతో ఇప్పుడు అమెరికాలో సరికొత్త వివాదం మొదలైంది.

టైమ్ మ్యాగజైన్‌ కవర్ పేజీలో ఓ విషయం ప్రచురితమైంది అంటే దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాంటి మ్యాగజైన్ ఈసారి మస్క్‌పై చాలా సంచలన విషయాలను అందులో చెప్పింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ రకంగా అమెరికాలో సమూళ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టారు. కొనసాగుతున్నవాటిని రద్దు చేశారు. అయితే వీటన్నింటిని వెనక మస్క్ ఉన్నారని చెబుతోంది టైమ్ మ్యాగజైన్. దీనికి సింబాలిక్‌గా అధ్యక్షుడి కార్యాలయంలోని టేబుల్‌, దాని వెనకున్న కుర్చిలో మస్క్‌ కాఫీ కప్పు పట్టుకున్నట్టు పేజీని డిజైన్ చేసింది.

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల పీకలపై కత్తులు వేలాడుతున్నాయి. ఇప్పటికే యూఎస్‌ఎయిడ్‌ను పూర్తగా రద్దు చేశారు. 9,700 మందిని ఇంటికి పంపించి వేస్తున్నారు. డీప్‌ స్టేట్‌పై వేటు పేరుతో అనేక రంగాల్లో ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెడీగా ఉన్నారు. ఇందులో ఇంటెలిజెన్స్, రక్షణ రంగ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీటన్నింటిని వెనక మస్క్ ఉన్నారంటోంది టైమ్స్ మ్యాగజైన్. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఇప్పుడు మస్క్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని చెబుతోంది.

అంతేకాదు మస్క్ ఎవరికి సమాధానం చెప్పేందుకు ఇష్టపడటం లేదని చెబుతోంది ఈ కవర్ స్టోరి. ట్రంప్‌కు తప్ప ఆయన ఇంకెవరికి జవాబుదారీ కాదని చెబుతోంది. ఈ కథనాన్ని రాసింది సైమన్ షుస్టర్, బ్రియాన్ బెన్నేట్‌. డోజ్‌ పనితీరుకు సంబంధించి వీరు పంపిన ప్రశ్నలకు వైట్‌హౌజ్‌ అస్సలు పట్టించుకోలేదంటున్నారు. అంతేకాదు మస్క్‌ తనకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వ విధానాలను మార్చుకుంటున్నారని ఆరోపించారు.

ఇప్పుడే కాదు గతంలో కూడా ట్రంప్‌పై కవర్ పేజీ ప్రచురించింది. అప్పుడు మస్క్‌ను కింగ్‌ మేకర్‌గా అభిర్ణిస్తూ దీనిని ప్రచురించింది. అయితే ఇదే విషయాన్ని జర్నలిస్ట్‌లు ట్రంప్‌ ముందు లెవనెత్తగా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తోందా? అంటూ సెటైర్లు వేశారు. అసలు టైమ్ మ్యాగజైన్‌ కొనసాగుతుందన్న విషయమే తనకు తెలియదంటూ తన వెటకారాన్ని కొనసాగించారు.

మరి నిజంగానే మస్క్ అధ్యక్షుడైతే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నను గతంలో ట్రంప్‌ను అడిగారు జర్నలిస్ట్‌లు. మస్క్ అమెరికాలో జన్మించలేదు కాబట్టి.. మస్క్ అధ్యక్షుడయ్యే చాన్స్‌ లేదు.. ఇది ట్రంప్ ఇచ్చిన సమాధానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com