36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ట్రంప్‌తో మోదీ చర్చించే అంశాలు ఇవేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ 12,13న అమెరికాలో మోదీ పర్యటించనున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. ఈ పర్యటనలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు మోదీ. అయితే ట్రంప్‌ ఆహ్వానం మేరకే మోదీ అమెరికా వెళుతున్నట్టు తెలిపింది విదేశాంగశాఖ. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాని అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. జనవరి 20న ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశాక మోదీ 27న ఆయనకు ఫోన్‌ చేసి అభినందించారు.

వాణిజ్యం…

తాను అధికారంలోకి రాగానే ఇతర దేశాలపై టారీఫ్‌లను పెంచుతానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారం నుంచి చెబుతున్నారు. ఇప్పుడీ విషయాన్ని నిజం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం కూడా చేశారు. అయితే భారత్‌పై కూడా ఆయన టారీఫ్‌ల ఆస్త్రాన్ని ప్రయోగిస్తానని ప్రకటించారు. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రక్షణ ఒప్పందాలు…

భారత్ అమెరికా మధ్య అనేక రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. అయితే వీటిని కుదించేంత పని అయితే ట్రంప్ చేయరు. వీలైతే బంధం మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రష్యా, చైనాకు చెక్‌ పెట్టాలంటే భారత్‌తో దోస్తీ అమెరికాకు అత్యంత అవసరం. దీనికోసమైనా మోదీతో చేయి కలపాల్సిందే ట్రంప్.

రీజనల్ సెక్యూరిటీ…

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు భారత్‌తో కలిసి నడవాలనుకోంటోంది అమెరికా. అందుకే ఇరు దేశాలు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

వలసదారుల అంశం…

అమెరికాలో పట్టుబడిన భారత వలసదారులను తిరిగి వెనక్కి తీసుకొచ్చే అంశంపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 487 మందిని వెనక్కి పంపించాలని అమెరికా నిర్ణయించడంతో వీరిని ఎలా తరలించాలనే దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com