30.6 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

యూజీసీ నిబంధనలు వెనక్కి తీసుకోవాలి – మంత్రి శ్రీధర్‌బాబు

విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సిలర్ల నియామకం విషయంలో యూజీసీ విధించిన నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. యూజీసీ నిబంధనల మార్పు వ్యవహారంలో కేంద్రపై ఒత్తిడి తేవడానికి త్వరలో కేరళలో మరో సమావేశం ఉంటుందని వెల్లడించారు. విద్యా వ్యవస్ధలో ఏ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో నిబంధనలు ఉండాలని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. విద్యావవస్ధలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందని అది మంచిది కాదన్నారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, గతంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకునే వారని కానీ ఇప్పుడు గవర్నర్‌కే పట్టం అంటే ఒప్పుకోమన్నారు. యూజీసీ విషయంలో రాష్ట్రాల హక్కులను కేంద్ర పరిధిలో పెట్టుకోవడంపై బీజేపీ రాష్ట్రాలు కూడా బాధపడుతున్నాయని శ్రీధర్‌బాబు తెలిపారు. గతేడాది 18 సంస్ధలతో ఎంఓయూలు చేసుకోగా వాటిలో 17 సంస్ధలు ప్రోగ్రెస్‌లో ఉన్నాయని చెప్పారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు మేము సిద్దంగా ఉన్నామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com