28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

కాశీ అన్నపూర్ణేశ్వరికి కుంభాభిషేకం

శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిచే విగ్రహ ప్రతిష్టాపన

దేశ ఆధ్యాత్మిక రాజధాని… విఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం శక్తి పీఠం విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. రేపు ఏడవ తేదీ శుక్రవారం రోజున కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ శృంగేరి జగద్గురువుల కరకమలం వచ్చే జరగబోతోంది. 50 ఏళ్ల క్రితం శృంగేరి శారదాపీఠం అప్పటి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి వారు అన్నపూర్ణేశ్వరి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేయగా… ప్రస్తుతం శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విదుశేఖరభారతీస్వామి వారు 50 ఏళ్ల తర్వాత అదే ఆలయంలో నూతనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ దేవాలయం స్వర్ణ గోపురానికి శృంగేరి జగద్గురువులు కుంభాభిషేకం చేయబోతున్నారు. 50 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని సన్నిధిలో జరుగుతున్న ఈ అపురూప అద్వితీయ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహా అనేకమంది ప్రముఖులు యతీశ్వరులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చనలో దేశవ్యాప్తంగా తరలివచ్చిన 150 మంది వేద పండితులు పాల్గొంటున్నారు. ఇదే సందర్భంలో మహా రుద్ర సహస్ర చండీ యాగాలను నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు శృంగేరి జగద్గురువులచే అన్నపూర్ణేశ్వరి ఆలయం లో అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట, స్వర్ణ గోపురానికి కుంభాభిషేకం జరగనున్నాయి.. ఈ సందర్భంగా దక్షిణం న్యాయ శృంగేరి శారదా పీఠం విడుదల చేసిన ఒక పేజీ కలర్ అడ్వర్టైజ్మెంట్ను తమరు తమ పత్రికలో ప్రచురించి అన్నపూర్ణేశ్వరి విశాలాక్షి కాశీ విశ్వనాధుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా శృంగేరి జగద్గురువుల ఆశీరనునుగ్రహంతో పీఠం అడ్మినిస్ట్రేటర్ మురళి కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com