మూడు దేశాలు, ఒక రాష్ట్రంలో బ్యాన్…
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన చైనా ఏఐ చాట్‌బాట్ డీప్‌సీక్‌పై నిషేధం విధించడం ప్రారంభమైంది. ఇప్పటికే మూడు దేశాలు దీనిపై నిషేధం విధించగా.. లెటెస్ట్‌గా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఈ యాప్‌ను వాడటంపై నిషేధం విధించింది. డేటా సెక్యూరిటీకి విషయంలో ఈ యాప్ ప్రమాదకరమంటూ ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ ప్రకటించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డైరెక్షన్‌లో పనిచేసే ఈ ఓపెన్ ఏఐ ప్లాట్‌ఫామ్ ప్రజల డేటాకు ముప్పు అన్నారు ఆయన. ఈ నిషేధం వెనక బిలియనీర్ ఎలాన్ మస్క్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. టెక్సాస్‌పై ట్రంప్ ఆధిపత్యం ఎక్కువని.. స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్స్‌ను కూడా టెక్సాస్‌లోనే ఏర్పాటు చేస్తున్నారని.. ఆయన ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. కారణం ఏదైనా ఇప్పటికే నిషేధం అయితే పడిపోయింది. ఇప్పుడు టెక్సాస్‌ను ఫాలో అయ్యే రాష్ట్రాలు ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇప్పటికే డీప్‌సీక్ ఉపయోగించడంపై అనేక అమెరికా ఏజెన్సీలు, కార్పొరేట్ కంపెనీలు అప్రకటిత నిషేధం ప్రకటించేశాయి. యూఎస్ ఫెడరల్ ఏజెన్సీలు, అమెరికా రక్షణ రంగాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించవద్దని నిర్ణయించాయి. డీప్‌సీక్‌పై ఇప్పటికే మూడు దేశాల్లో నిషేధం అమల్లో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడంపై మొదట నిషేధం విధించిన దేశంగా ఆస్ట్రేలియా నిలించింది. ప్రజల భద్రత, డేటా బ్రీచ్ కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియా బాటలోనే ఇటలీ, తైవాన్ కూడా నడిచాయి. ఇప్పుడీ మూడు దేశాలు కాకుండా.. టెక్సాస్ కూడా నిషేధం విధించింది.
ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో డీప్‌సీక్ ఓ హాట్ టాపిక్. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు పోటీగా.. అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఏఐ మోడల్ సంచలనం సృష్టించింది. స్థాపించిన 20 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ చైనాను నమ్మలేం కాబట్టి.. దీన్ని ఉపయోగించడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇండియాలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ కూడా చాట్ జీపీటీ, డీప్‌సీక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.