31.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

అమెరికా వైట్‌హౌజ్‌లో 13న బిగ్ మీటింగ్

అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోదీ బిగ్‌ మీటింగ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో 13వ తేదీన ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ, ట్రంప్‌ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫస్ట్‌ టైమ్‌ డోనాల్డ్‌ ట్రంప్‌తో మన ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు.

అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన.. విశ్వాసపూరిత భాగస్వామ్యానికి- భారత్‌ కట్టుబడి ఉందని ట్రంప్‌కు తెలిపారు మోదీ. భారత్‌-అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్‌కు వివరించారు మోదీ. ఇప్పుడు మోదీ, ట్రంప్‌ చర్చలపై వైట్‌హౌస్‌ అధికారిక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్‌కాల్‌లో చర్చ జరిగిందని తెలిపింది. అలాగే, రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్‌, మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆ ప్రకటనలో వివరించింది. దీంతోపాటు అమెరికా తయారుచేసిన‌ ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్‌కు విజ్ఞప్తి చేసినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్‌ కోరారు. మరోవైపు.. రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ఈ ఏడాది తొలిసారి భారత్‌లో క్వాడ్‌ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్‌ ఈ ఫోన్‌కాల్‌లో చర్చించారని వైట్‌హౌస్‌ వివరించింది.అయితే, ఇప్పటికే అక్రమ వలసదారులపై అమెరికా కొరడా ఝళిపించింది. అక్రమ వలసలపై మోదీ, సరైన నిర్ణయం తీసుకుంటారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌- మోదీ బిగ్‌ మీటింగ్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com