టీమిండియా బౌలర్ మహ్మద్ షమీని ఓ రికార్డు ఊరిస్తోంది. కేవలం ఐదంటే ఐదు వికెట్లు తీస్తే చాలు.. ఓ సరికొత్త రికార్డ్‌ను సృష్టించనున్నాడు షమీ. అయితే ఈ రికార్డ్ క్రియేట్ చేయాలంటే గురువారం రోజు నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేలో ఐదు వికెట్లు తీయాల్సి ఉంటుంది.
షమీ ఇప్పటి వరకు 101 వన్డేలు ఆడాడు. ఇందులో 195 వికెట్లు తీశాడు. నాగ్‌పూర్‌లో కనుక ఐదు వికెట్లు తీస్తే అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. నిజానికి ఈ రికార్డ్ ఇప్పటికే ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ పేరుపై ఉంది. స్టార్క్ 102 మ్యాచ్‌లలో 200 వికెట్లు తీశాడు. షమీ కూడ ఈ ఫీట్‌ను సాధిస్తే అతని సరసన చేరుతాడు. నిజానికి ఈ ఫీట్‌ను బీట్ చేసేందుకు భారత్‌లో మరెవ్వరూ షమీ దరిదాపుల్లో లేరనే చెప్పాలి.
ఇప్పటి వరకు భారత్ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా అజిత్ అగార్కర్ ఉన్నాడు. 2004 డిసెంబర్ 26న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన 133వ మ్యాచ్‌లో అగార్కర్ తన 200వ వికెట్‌ను సాధించాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్ 144 మ్యాచ్‌లు, కుంబ్లే 147,శ్రీనాథ్ 147, కపిల్ దేవ్166 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీశారు. మొత్తంగా చూస్తే వన్డేల్లో భారత్ తరపున 200కు పగా వికెట్లు తీసిన వారు కేవలం ఏడుగురు మాత్రమే. ఇప్పుడ లిస్ట్‌లో షమీ చేరితే ఎనిమిదోవాడు అవుతాడు.
షమీ గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే కొలుకొని తిరిగి టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో మూడు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చాటాడు. ప్రస్తుతం వన్డే సిరీస్‌కు బుమ్రా లేకపోవడంతో టీమ్ ఇండియా పేస్ దళాన్ని షమీ లీడ్ చేయబోతున్నాడు.
మరో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు వన్డేల్లో 300కు పైగా వికెట్లు తీసిన టీమిండియా ప్లేయర్లు ఇద్దరు మాత్రమే. కుంబ్లే 334 వికెట్లు తీయగా.. జవగళ్ శ్రీనాథ్ 315 వికెట్లు తీశాడు.