తన తల్లి మేనక సురేష్ వారసత్వంతో ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, తెలుగు తమిళ్ భాషల్లో సూపర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన కంటూ ఒక పేరు సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. అలనాటి నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ అనే సినిమా లో నటించి ఉత్తమ నటి గా అవార్డు కూడా తీసుకుంది కీర్తి సురేష్. కీర్తి కెరీర్ లోనే ‘మహానటి’ అనే మూవీ ఒక మైలు రాయి.
తన ఫ్రెండ్ ‘అట్లీ’ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుణ్ ధావన్ తో జంటగా ‘బేబీ జాన్’ అనే సినిమాలో నటించింది కీర్తి సురేష్. అయితే, ఎందుకో ఈ సినిమా అంత పెద్దగా అనుకున్నంత ఆడలేదు. గత సంవత్సరం డిసెంబర్ 12న గోవాలో కొంత మంది శ్రేయోభిలాషుల మధ్యన తన ప్రియుడు, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ థాటిల్‌ను వివాహం చేసుకుంది కీర్తి సురేష్.
బేబీ జాన్ సినిమా తర్వాత నెట్ ఫ్లిక్స్ ద్వారా వస్తున్న ‘అక్క’ అనే సిరీస్ లో నటిస్తోంది కీర్తి సురేష్.. నిన్ననే టీజర్ లాంచ్ చేశారు. అక్క సిరీస్ లో బోల్డ్ లుక్ లో కీర్తి సురేష్ కనిపిస్తున్నట్లు సమాచారం.
అక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో మెడలో గోల్డెన్ మంగళసూత్రం, చేతులకు గాజులు వేసుకుని, హెయిర్ లీవ్ చేసి.. వైట్ శారీలో అందంగా ముస్తాబై క్యూట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది కీర్తి సురేష్. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.