31.7 C
Hyderabad
Friday, June 19, 2026

Live Video

spot_img

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం పరిధిలోని చిల్వాకోడూరు వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్‌ డీసీఆర్‌బీలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేత అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు కూడా స్పాట్ లోనే దుర్మరణం చెందారు. ధర్మారం నుంచి  జగిత్యాలకు వస్తున్న ఎస్‌ఐ శ్వేత ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగాన్ని నియంత్రించలేకపోవడంతో కారు రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ప్రమదం జరిగిన సమయంలో కారు ఎస్సై స్వాతినే డ్రైవ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డీసీఆర్‌బీ జగిత్యాలలో ఎస్‌ఐగా పని చేస్తున్నశ్వేత గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్‌, పెగడపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com