25.7 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ రథసప్తమి వేడుకలు

అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ రథసప్తమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని సూర్య ఆరాధనను విశేషంగా ఆచరించారు. నెల్లూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమ ఆవరణలో రథసప్తమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ రథసప్తమి వేడుకలలో అశేష భక్తులు పాల్గొన్నారు. పంచభూతాలకు, ముఖ్యంగా సూర్య నారాయణ మూర్తికి అర్ఘ్యం సమర్పించి, హారతులు అర్పించారు. ఆశ్రమానికి హాజరైన భక్తులందరూ గణపతి సచ్చిదానంద స్మామివారితో కలసి ఆదిత్య హృదయాన్ని పఠించారు. సచ్చిదానంద స్వామీజీ తలపై అగ్ని వెలిగించి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. అనంతరం స్వామివారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యక్ష కర్మ సాక్షి అయిన సూర్యుడి ఉపాసన వల్ల అందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని వేదోక్తి. అంతటి విశేషమైన ఆరాధనను చేసినా, చూసినా అందరికీ మంచి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. నెల్లూరు దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో వేకువ జామునే ఆదిత్యుడి ఆరాధనకు సిద్దమై సూర్యభగవానుడికి స్వాగతం పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com