నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి తెలుగు దేశం పార్టీ ఖాతాలోకి చేరింది. ముస్లిం మైనారిటీ కార్పొరేటర్ తహసీన్ 29 ఓట్ల మెజారిటీతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమెకు 41 ఓట్లు వచ్చాయి. ఆమెపై పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు రాగా.. తహసీన్ 29 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో, తహసీన్ డిప్యూటీ మేయర్‌గా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కాగా.. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో కలకలం చెలరేగింది. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపీ కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మధ్య మొదలైన మాటల యుద్ధంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ మధ్యలో కల్పించుకున్నారు. జాయింట్ కలెక్టర్ సర్దిచెప్పడంతో సమావేశంలో మొదలైన గొడవ సర్దుమణిగింది. అనంతరం డిప్యూటీ మేయర్‌గా సయ్యద్ తహసిన్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.