ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే ఇకనుంచి హాల్ టికెట్ల లింకులు రానున్నాయి. గతంలో కేవలం కాలేజీలకే హాల్ టికెట్లను బోర్డు పంపించేది. ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలనే వారు. ఇప్పుడు విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్‌కు నేరుగా హాల్ టికెట్ లింకులను ఇంటర్ మీడియట్ బోర్డు పంపించనుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ఉన్న హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలని ఇంటర్బోర్డులోని ఓ అధికారి తెలిపారు. ఈ అంశంలో ఏవైనా సందేహాలుంటే.. కాలేజీ సిబ్బందిని అడిగి తెలుసు కోవాలన్నారు. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు సమస్యలు తలెత్తితే కళాశాలకు వచ్చి సమస్య తెలియజేయాలన్నారు. శుక్రవారం నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే వారికి సంబంధించిన హాల్ టికెట్లను విద్యార్థులకు పంపించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ జరగ బోతున్నాయి. వారికి కూడా త్వరలోనే హాల్ టికెట్ల లింకులు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.