26.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

తెలంగాణలో చలి పులి

తెలంగాణలో రెండు రోజుల్లోనే చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయు. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ రోజు ఉదయం 9.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో మొదటి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత ఇదే కావటం గమనార్హం. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ 10-12 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.

రాజేంద్రనగర్‌లో 12.4డిగ్రీలు, బిహెచ్‌ఇఎల్‌లో 12.8 డిగ్రీలు నమోదవడంతో హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత మరింత పెరిగింది. ఇబ్రహీంపట్నం, మంగళపల్లె వంటి శివార్లలో 11.4డిగ్రీలు నమోదైంది. ఉత్తర, దక్షిణ హైదరాబాద్ లో  13-15 డిగ్రీలు నమోదైంది. కోర్ సిటీలో 17-19 డిగ్రీలు నమోదైంది. రాబోయే 8 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com