36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో హుండీ లెక్కింపు చేపట్టారు. శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వార్ల పుణ్యక్షేత్రంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించారు. శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.2,59,68,400 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో సమర్పించడం జరిగింది. ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు ఇవి. ఈ నగదుతో పాటు 64 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 3కేజీల 170 గ్రాముల వెండి భక్తులు హుండీ ద్వారా సమర్పించారు.అదేవిధంగా 590 యుఎస్ఏ డాలర్లు, 100 చైనా యువాన్స్, 5 సౌదీ అరేబియా రియాల్స్, 2 కువైట్ దినార్లు, 10 కెనడా డాలర్లు, 1090 యూఏఈ దిర్హమ్‌లు, 14 సింగపూర్ డాలర్లు, ఒక ఖతార్‌ రియాల్‌, 5 యూరోలు, 23 మలేషియా రింగిట్లు, 45 యూకే ఫౌండ్లు, 240 ఆస్ట్రేలియా డాలర్లు, 30 రష్యా రూబెల్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో కనుక్కున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో దేవస్థానం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com