ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయిదేళ్లలో కాలంలో జగన్ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేయగా, లక్షా 40 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందన్నారు. ఇప్పుడవి తమ ప్రభుత్వానికి, ప్రజలకు శాపంగా పరిణమించాయని విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో మొత్తం 8లక్షల కోట్లు దోపిడీ జరిగిందన్నారు కొనకళ్ల నారాయణ లిక్కర్ కమిషన్ రూపంలో లక్షా 5వేల కోట్ల రూపాయలు, ఇండోసోల్ కుంభకోణంలో లక్ష కోట్ల రూపాయలు, విద్యుత్ ఒప్పందాల కుంభకోణంలో 50వేల కోట్ల రూపాయలు, ఇసుక దోపిడీలో 60వేల కోట్ల రూపాయలు, గ్రావెల్ దోపిడీతో 22వేల కోట్ల రూపాయలు జగన్, జగన్ కుటుంబం దోచుకుందని కొనకళ్ల నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అందుకే ఏపీ ప్రజలు ఇప్పుడు సరైన తీర్పు ఇచ్చారని నారాయణ నఅ్నారు. జగన్ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని, దోపిడీకి గురయ్యిందని, ప్రజలు గుర్తించి.. వాళ్లు పాలనకు పనికి రారు అని.. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గాడితప్పిన పాలనను గాడిలో పెడుతున్నారని, కుదేలైన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చెప్పారు.