35.9 C
Hyderabad
Thursday, June 18, 2026

Live Video

spot_img

ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగితే… అక్కడ కవిత పేరు

  • కవితపై మరో లిక్కర్ ఆరోపణ.
  • ఈసారి కేరళ లిక్కర్ స్కాంలో కవిత పేరు.
  • ఆరోపించిన కాంగ్రెస్ నేత.
  • తనకు సంబంధం లేదంటున్న కవిత.

ఎక్కడ ఏం జరిగినా అది మనకే చుట్టుకుంటుంది… ఇది సినిమా డైలాగ్ అయినా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ కేస్‌లో బెయిల్ పై విడుదలైన కవిత కు ఇప్పుడు కేరళ లిక్కర్ కేసు కూడా మెడకు చుట్టుకుంటోంది. కేరళలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కవిత కీలక పాత్ర పోషించందని ఆరాష్ట్ర అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. లిక్కర్‌ టెండర్ల విషయంలో కేరళ ప్రభుత్వం ఓయాసిస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి లాభం చేకూర్చే రకంగా వ్యవహరించారని ఇందులో కవిత పాత్ర కీలకమని ఆయన ఆరోపిస్తున్నారు. 2023 లో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి కవిత తరచు కేరళకు వచ్చారని ఇక్కడ కొందరి సహకారంతో ఆమె ఈ కుంభకోణంలో యాక్టివ్ గా ఉన్నారన్నది ఆయన ఆరోపణ. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు సంచలనగా మారుతున్నాయి.

అయితే బిఆర్ఎస్ నాయకురాలు కవిత మాత్రం ఈ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నారు. దీనిపై లీగల్ ఆక్షన్ తీసుకుంటానని ఆమె ప్రకటించారు. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా సతీశన్ చేసిన ఆరోపణలపై లీగల్ నోటిస్ ఇస్తానని ఆమె హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి పూర్తిస్థాయిలో బయటపడక ముందే కేరళ లిక్కర్ కేసు తెరపైకి రావడం టీఆర్ఎస్‌ వర్గాలను కలవరపరుస్తోంది. ఇప్పటికే పార్టీలోని అగ్రనేతలందరూ కేసుల వయంలో చిక్కుకుని వివిల్లాడుతున్నారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌, ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హరీష్ రావులు విచారణ కమిటీల చుట్టు తిరుగుతున్నారు. వీరిద్దరూ ఎప్పుడు అరెస్టై జైలుకు వెళతారో అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌ పై విడుదలైన తరువాత రెండు మూడు నెలలు ఇంటికే పరిమితమైన కవిత నెలరోజులగానే ప్రజల్లోకి వస్తు్న్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శలు చేస్తూ, సవాళ్ళు విసురుతూ ఇప్పుడిప్పుడే యాక్టీవ్‌ అవుతున్నారు. కేటీఆర్‌, హారీష్‌ రావులు జైలుకు వెళ్ళే పరిస్ధితి వచ్చినా వారు బెయిళ్ళపై విడుదలయ్యే లోపు కవిత పార్టీని ముందుకు నడిపిస్తుందనే ధైర్యంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఉంది. ఈదశలో మళయాళ మద్యం కుంభకోణంలో కవిత పేరు తెరపైకి రావడంతో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఉలిక్కిపడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com