22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఈ మెడల్ వెనక కథేంటో తెలుసా?

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా త్రివిధ దళాలకు చెందిన కొందరు సైనికులకు మెడల్స్‌ అందించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ మెడల్ తీసుకునే సైనికులు అత్యంత డేరింగ్ ఆపరేషన్స్‌లో ప్రాణాలకు తెగించి పోరాడినవారో.. లేదంటే అసమాన ధైర్య సాహసాలను చూపిన వారో ఉంటారు. ఈసారి కూడా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు సైనికులు. అయితే ఇందులో వాయుసేన మెడల్ అందుకున్న అక్షయ్ సక్సెనా స్టోరి చాలా హీరోయిక్‌గా ఉందనే చెప్పాలి.

మార్చి 16, 2024న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ అరేబియన్ సముద్రంలో ఓ డేరింగ్ ఆపరేషన్‌ నిర్వహించింది. పైరెట్ల చేతికి చిక్కిన ఓ కార్గో షిప్‌ను.. అందులోని 17 మంది సిబ్బందిని విడిపించడం దాని లక్ష్యం. అయితే సోమాలియా తీరానికి చేరువలో ఉన్న ఈ షిప్‌ను విడిపించడం అంటే మాములు విషయం కాదు. కానీ ఇండియన్ నేవీ మాత్రం వారిని ఎలాగైనా విడిపించాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకోసం మెరికల్లాంటి 18 మంది మార్కోస్ కమాండోలను రంగంలోకి దించింది. అయితే నడి సముద్రంలోకి పంపడం ఎలా? అక్కడ ఆపరేషన్ నిర్వహించడం ఎలా? ఈ క్వశ్చన్‌కు ఆన్సరే అజయ్ సక్సేనా

వింగ్ కమాండర్ సక్సెనా కారణంగానే ఈ ఆపరేషన్‌ అత్యంత వేగంగా అమల్లోకి వచ్చినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన చాలా రహస్య విషయాలను రక్షణశాఖ బయటపెట్టింది. ఈ మిషన్‌ గురించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు అప్పట్లో. శత్రుదేశాల ఎయిర్‌స్పేస్‌కు చిక్కకుండా.. అరేబియన్‌ సీలో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ సమయంలో 18 మంది మార్కో కమాండోలు.. వారికి కావాల్సిన రెండు బోట్స్‌ను తరలించిన సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా నడిపింది వింగ్ కమాండర్ సక్సేనా, అతని టీమ్‌. వ్యూహాత్మక ప్రాంతంలో మార్కో కమాండోలు, బోట్లను ఎయిర్‌ డ్రాప్ చేశాడు సక్సేనా.

పారాచ్యూట్స్‌తో సముద్రంలోకి దిగిన కమాండోలు.. ఆ తర్వాత ఆ రెండు బోట్లలో పైరెట్ల షిప్‌ను చుట్టుముట్టారు. ఆ తర్వాత షిప్‌లోకి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కథ సుఖాంతమైంది.

భారత తీర జలాలకు అవతల.. సోమాలియా తీరానికి దగ్గరలో జరిగింది ఈ ఆపరేషన్‌. అప్పటికే ఈ పైరెట్లు ఇండియన్ నేవీ షిప్ INS కోల్‌కతాపై కాల్పులు జరపడమే కాకుండా.. మన నేవీకి చెందిన ఓ స్పాటర్ డ్రోన్‌ను కూల్చేశారు. దీంతో మార్కో కమాండోలు రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్‌ మొత్తం జరగడానికి 10 గంటల సమయం పట్టింది.  ఈ మిషన్‌లో అక్షయ్ సక్సెనా చూపించిన ధైర్య సాహసాలు, లీడర్ షిప్, ప్రొఫెషనలిజమ్‌ను గమనించిన IAF అధికారులు అతడి పేరును వాయు సేన మెడల్‌కు రిఫర్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com