జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా తొలి సినిమాతోనే ప్రేక్షకులను రంజింపచేసింది.
ఇటీవల మత్తు వదలరా 2 సినిమా ద్వారా తెలుగు సినీ అభిమానులను మెప్పించింది.
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో వీడియోలు చేసింది.
ఓ వెబ్ సిరీస్ లోనూ నటించిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో చిన్న పాత్ర చేసినా ఆకట్టుకుంది.