31.8 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

వైసీపీ తొత్తులను వేదిక ఎక్కిస్తారా – మంత్రి కొల్లు రవీంద్ర

తనపై తప్పుడు కేసులు పెట్టి, తనని తన కుటుంబాన్ని విపరీతంగా వేధించన వ్యక్తిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించి వేదికపై కూర్చోపెట్టడంపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు పార్టీ నేతలపై మండిపడ్డారు. మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నాయీ బ్రహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుని ఆహ్వానించడంపై కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సీర్సీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాజిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్‌బాబు తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేశారని, తన కుటుంబాన్ని కూడా వేధించిన వ్యక్తితో అంటకాగుతూ తనను అవమానిస్తారా అని రవీంద్ర టీడీపీ నేతను నిలదీశారు. వైసీపీ నేతలకు తొత్తులా పనిచేసిన వ్యక్తిని సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసువెళతానని చెప్పారు. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. మంగళవారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన నాయీ బ్రాహ్మాణ కార్పొరేషన్‌ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం అందింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి కొల్లు రవీంద్ర హాజరుకాలేదు. ఈ ఉదయం కార్యక్రమానికి హాజరైన అతిథుల్లో రవీంద్రనాథ్ బాబు ఉన్నారనే విషయం తెలుసుకుని మంత్రి తన అసహనం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com