సూడాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సూడాన్ దేశానికి చెందిన మిలటరీ విమానం టెకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ బేస్ పక్కనే ఉన్న నివాసాలపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 46 మంది మృతి చెందినట్లు సమాచారం. సూడాన్‌లోని ఓమ్డర్మ్యాన్ సిటీకి ఉత్తరం వైపున ఉన్న వాడీ సయిద్నా వైమానిక స్ధావరం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరిన మిలటరీ విమానం కొన్ని నిమిషాలకే జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఈఘటనలో 46 మంది సజీవదహనం అయ్యారు. వీరిలో ఎక్కువమంది సైనికులు ఉండగా కొంతమంది పౌరులు కూడా మృతి చెందినట్లు సమాచారం. సూడాన్ ఆర్మీ సీనియర్ కమాండర్ బహర్ అహ్మద్ కూడా ఈ విమానంలో ప్రయణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదినికి గల కారనాలు మాత్రం వెల్లడికాలేదు. సాంకేతిక కారణాలే ఈ ప్రమాదానికి కారణాలని మిలటరీ అధికారులు ప్రథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ విమాన దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మిలటరీ వర్గాలు తెలిపాయి. అయితే సూడాన్ పై పట్టుకోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ల మధ్య జరుగుతున్న అంతర్యుద్దం ఈ మధ్య కాలంలో తీవ్రమయ్యింది. అయితే ఇటీవల న్యాలా ప్రాంతంతో ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ల అందర్యుద్దం కారణంగా ఏమన్నా ఈ విమాన ప్రమదం చోటుచేసుకుందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.