ఏపీ క్యాబినేట్ నిర్ణయం
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఎంఎస్ఎమ్ఈ పాలసీలో మార్పులు చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఎమ్ఎస్ఎమ్ఈ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే అమరావతిలో సీఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పమితి పెంచే అంశంపై క్యాబినేట్లో చర్చ జరిగింది. నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు క్యాబినేట్ అంగీకరించింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన నీరు చెట్టు పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లించడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇక మద్యం ధరలపైనా, పోలవరం నిర్వాసితులకు ఇళ్ళు నిర్మించే అంశంపైనా ఈ మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి మండలి ముందుకు రిజిస్ట్రేషన్ల శాఖలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేసే ప్రతిపాదన వచ్చింది. టీటీడీ పోటు విభాగంలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులను సూపర్వైజర్లుగా అప్గ్రేడ్ చేసే అంశాన్ని కూడా క్యాబినేట్ పరిశీలించింది. తిరుపతి జిల్లాలోని తమ్మినపట్నంతో పాటు కొత్తపట్నం సీబీఐసీలో భూములు కోల్పోయిన వారికి పరిహారం పెంపు అంశం కూడా క్యాబనేట్లో చర్చించారు వీటితో పాటు భారత్లో తయారైన విదేశీ మద్యంపై రిటైల్ ఎక్సై్ టాక్స్ సవరణ అంశం చర్చించిన క్యాబినేట్ 44,776 కోట్ల రూపాలయ వివిధ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ సమ్మతి తెలిపింది. వైరల్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశానికి హాజరు కాలేదు.