28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

2025లో వీరంతా క్రికెట్ కి గుడ్ బై…!

2025లో సరికొత్త టీమ్ ఇండియా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్‌ రిటైర్మెంట్ ప్రకటించగా.. అదే బాటలో మరికొందరు సీనియర్లు నడుస్తున్నట్టు తెలుస్తోంది. 2025లో చాలా మంది రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నట్టు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. అయితే చాలా మంది ఒకేసారి లేదా.. ఒక్కక్కరుగా ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. అవకాశాలు తక్కువే గానీ ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరుకుంటే చాలా మార్పులు ఉండే అవకాశం తప్పకుండా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్ వేదిక‌గా WTC ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

రోహిత్ శకర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీరు ముగ్గురు ఏ క్షణమైనా ఆటకు అల్విదా పలికే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ చేజారితే ఈ రిటైర్మెంట్‌లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ సిరీసే వారికి చివరిదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీమ్ ఇండియా ఫ్యూచర్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ కీలక నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది ఇంగ్లాండ్ టూర్‌ నాటికి టీమ్ ఇండియా సీనియర్లు తమ భవితవ్యంపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. 2008లో సౌరభ్ గంగూలీ, అనిల్ కుంబ్లే ఒకే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినట్టుగానే.. 2025 భారత క్రికెట్​లో రిటైర్మెంట్ ఇయర్‌ అయ్యే అవకాశం ఉంది. టీమ్ ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్ తర్వాత ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే ఈ ముగ్గురు టీమ్ ఇండియా తరఫున ఆడుతున్నారు.

అయితే కోహ్లీ రిటైర్మెంట్‌ పై వస్తున్న ఊహాగానాలను మాత్రం కొట్టిపారేస్తున్నాడు.. చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ. విరాట్ ఇప్పట్లో రిటైర్ అవ్వడని.. వన్డే ప్రపంచ కప్-2027 వరకు అతడు ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాతే రిటైర్ అవుతాడని అన్నాడు. ఓవరాల్‌గా మరో 5 ఏళ్ల పాటు పక్కా అతడు క్రికెట్‌లో కొనసాగుతాడని చెబుతున్నాడు. అయితే ఇది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. కానీ ఇంకోన్నాళ్లు అడే సత్తా కోహ్లీలో ఉన్నా.. టీమ్ ఇండియా ఫ్యూచర్‌ను దృష్టిలో ఉంచుకొని కోహ్లీ పద్ధతిగా అస్త్ర సన్యాసం చేసే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com