ముంబయ్ అరేబియన్ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. బుధవారం గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు ప్రయాణీకులతో బయలుదేరిన నీల్ కమల్ అనే పేరు గల పడవని నేవీకి చెందిన బోటు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బోటులో ఉన్న అందరూ సముద్రంలో పడిపోయారు. ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడగా 100 మందికి పైగా ప్రయాణికులను నేవీ సిబ్బంది కాపాడారు. నేవీ బోటు అత్యంత వేగంతో నీల్ కమల్ ఫెర్రీ బోటును ఢీకొట్టడంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయినట్లు మహారాష్ట్ర సీయం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఇటీవలే నేవీ బోటుకు బిగించిన కొత్త ఇంజన్ ని పరీక్షీస్తున్న క్రమంలో స్పీడ్ బోట్ అదుపుతప్పడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.