సిరియాలో రెబల్స్ తిరుగుబాటు.. అధ్యక్షుడు బషల్ అల్ అసద్ పారిపోవడాన్ని క్యాష్ చేసుకుంటోన్న హమాస్, హెజ్బుల్లాతో పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్.. సిరియాపై ఫుల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే బఫర్ జోన్‌గా ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్.. ఇప్పుడు తన ఫోకస్‌ను సిరియా ఆయుధ సంపత్తిపై పెట్టింది. ఐసిస్‌కు అందకూడదన్న ఆలోచన కావొచ్చు.. లేక అమెరికా ఆదేశాలు కావొచ్చు.. కారణమేదైనా ఆపరేషన్ బషన్ యారోను స్టార్ట్ చేసి సిరియాలోని మిలటరీ స్థావరాలపై విరుచుకపడుతుంది.
ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ దెబ్బకు సిరియన్ ఆర్మీకి చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఐడీఎఫ్‌కు చెందిన 350 ఫైటర్ జెట్స్ సిరియా ఎయిర్‌బేస్‌లపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్ నుంచి దేశంలోని రెండో అతి పెద్ద పోర్టు సిటీ అయిన టార్టస్ వరకు సాగిన ఈ దాడుల్లో మొత్తం 320 టార్గెట్లను ధ్వంసం చేశాయి. ఇక సిరియన్ నేవీ బేస్‌లపై కూడా ఈ దాడులు కొనసాగాయి. నేవీ స్థావరాలపై మాత్రం ఇజ్రాయెల్ మిసైల్ దాడులు చేసింది. 15 సిరియన్ నౌకలతోపాటు అనేక క్షిపణులను, ఆయుధాలను ధ్వంసం చేశాయి. అనేక రసాయన ఆయుధాల డిపోలపై కూడా ఐడీఎఫ్ దాడులు జరిపినట్టు తెలిపింది.
నిజానికి ఈ దాడులు రెబల్స్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. రెబల్స్ నిజంగా ప్రజాస్వామ్య బద్ధంగా పాలించాలని ఆశిస్తే పెద్ద ఎఫెక్ట్ ఏం ఉండేది కాదు. కానీ.. వారి లక్ష్యాలు వేరే అయితే మాత్రం ఇది వారికి షాకింగ్ న్యూసే అనే చెప్పాలి. మరో విషయం ఏంటంటే ఈ ఆయుధాల ధ్వంసంతో మరోసారి ప్రపంచ మార్కెట్‌లో ఆయుధాల వ్యాపారానికి డిమాండ్ పెరగడం ఖాయం. అయితే అమెరికా, యూరప్ లేదంటే రష్యన్ డిఫెన్స్ సెక్టార్‌కు మళ్లీ గిరాకీ పెరగనుంది.