37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సాయంత్రం ఐదు గంటల వరకూ హైస్కూళ్ళు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యా పాఠశాలలను ఇక నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పనివేళలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా సాయంత్రం ఐదు గంటల వరకూ పని వేళలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ఐదు రోజులు పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రతి మండలంలోనూ ఒక ఉన్నత పాఠశాలలో సవరించిన పనివేళలు అమలు జరిగేలా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. పైలట్ ప్రాజెక్ట్ పూర్తైన తరువాత విద్యా కమిటీలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించి నూతన పనివేళలను అమలు చెయ్యానలి విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com