ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శనివారం జీరో అవర్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీరో అవర్ లో తాము అడిగిన ప్రశ్నలను మంత్రులు ఎవరూ నోట్ చేసుకోవడం లేదని, అలాగే సరైన సమాధానాలు కూడా చెప్పడం లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు కూన రవి కుమార్ స్పీకర్ అయ్యన్న పాత్రుడి దృష్టికి తీసుకు వెళ్ళారు. జీరో అవర్ డ్రైవర్ లేని కారులా తయారయ్యిందని రవికుమార్ వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ కలగజేసుకుని సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటినీ మంత్రులు నోట్ చేసుకుని సమాధానాలు చెప్పాలని సూచించారు. రవికుమార్ అభ్యంతరంపై మంత్రి అచ్చెంనాయుడు సమాధానమిస్తూ… జీరో అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలను తాము నోట్ చేసుకుంటున్నామని, సమస్యలు పరిష్కరించిన తరువాత సమాధానం ఇస్తామని వివరించారు.
- Advertisement with us -