ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,41,017 నివాసాలు గుర్తించగా, శుక్రవారం వరకు 1,01,40,767 నివాసాలలో సర్వే పూర్తి చేసి 87.1 శాతం సాధించింది. జనగాం, ములుగు జిల్లాలలో ఇప్పటికే వంద శాతం సర్వే పూర్తయింది. మెదక్, నల్గొండ జిల్లాలో 99.9 శాతంతో పూర్తి కావొస్తుంది. మిగతా 23 జిల్లాలలో జోగుళాంబ గద్వాల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, ఖమ్మం, నారాయణపేట, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, సూర్యాపేట, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నిర్మల్, వరంగల్, సిద్దిపేట 90 శాతం పైగా సర్వే పూర్తయింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాలో కూడా 80 శాతానికి పైగా సర్వే పూర్తయింది. అదేవిధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లో 75.1 శాతం సర్వే పూర్తయింది.
జి.హెచ్.ఎంసీ పరిధి లో కూడా సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. జిహెచ్ ఎంసీ పరిధి లో 25,05,517 నివాసాలు సర్వే చేయల్సిసి వుండగా 16,37,563 నివాసాలు సర్వే పూర్తిచేసి 65.4 శాతం చేరుకుంది.
శుక్రవారం నాటికి కోటి ఇళ్లలో సమగ్ర ఇంటింటి సర్వే
- Advertisement with us -