సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ తో అదరగొట్టిన ‘ముఫాసా’ ఫైనల్ తెలుగు ట్రైలర్- డిసెంబర్ 20న థియేరిటికల్ రిలీజ్ బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న విజువల్ వండర్ ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.
విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముఫాసా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రోజు (బుధవారం) తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అదిరిపోయింది. విజువల్ వండర్ అనిపించిన ఈ ట్రైలర్ లో మహేష్ బాబు వాయిస్ ఆకట్టుకుంటోంది. ‘ముఫాసా’ పాత్రకు మహేష్ బాబు చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది.
టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇవ్వగా టిమోన్ అండ్ పుంబాగా అలీ, బ్రహ్మానందం డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ లేటెస్ట్ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది.