తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని బీజేపీ ఎంపీ డీకేఅరుణ అన్నారు. బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ కాలికి గజ్జెలు కట్టుకుని ప్రచారం చేసిందని.. తెలంగాణ మోడల్ అంటూ చేసిన ప్రచారం భోగస్ అని తేలిపోయిందని చెప్పారు. బీజేపీని ఈ దేశ ప్రజలు విశ్వసించారు అందుకే అద్వితీయమైన గెలుపు అందించారన్నారు. మహరాష్ట్ర ప్రజలు మోడీ, ఫడ్నవిస్, షిండేలపై నమ్మకం ఉంచారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ కు చెంప పెట్టులాంటిదన్నారు. మహరాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా మోడీ, అమిత్ షా, నడ్డాలకు డికే అరుణ అభినందనలు తెలిపారు.