ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద డిసెంబర్ 18 సాయంత్రం 5గంటలకు జరిగే విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞతా సభ కరపత్రాన్ని సోమవారం మద్యాహ్నం నీటిపారుదల, పౌరసరపరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కృతజ్ఞత సభకు తప్పకుండా వస్తానని నిర్వాహకులకు మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్,చామకూరి శ్రీధర్ గౌడ్,పట్ల నాగరాజు,భైరు నాగరాజు గౌడ్,బోనాల నగేష్,ఇంటి మణికంఠ నాయుడు,అదిలాబాద్ నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ పొన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.