33.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

హైబ్రిడ్ వాహనాలపై పన్ను రాయితీ..!

తెలంగాణలో ఢిల్లీ పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవి పాలసీ తెచ్చామన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందని తెలిపారు. ఈవి వాహనాలపై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని, ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు.

కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేయించాలని సూచించారు. హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీపై ఆలోచిస్తున్నామన్నారు. ప్రజలు ఈవి వాహనాలు కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com