పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ పోలీసు కీచకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికతో హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదయ్యింది. మానేపల్లి సింగ్ పోడూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మానేపల్లి సింగ్ సెలవులో ఉన్నాడని, పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.