24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

“హరికథ” వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ “హరికథ” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి “హరికథ” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు “హరికథ” సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

శ్రీవిష్ణు అవతారాల రూపంలో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు ?, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ విచారణలో పోలీస్ ఆఫీసర్ కు ఎదురైన ఘటనలు ఏంటి? నాటకాల్లో దేవుడి పాత్రలు పోషించే నటుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించగా..పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్ నటించారు. మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన “హరికథ” ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

నటీనటులు – దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com