24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

సుక్మా జిల్లాలో పేలిన ప్రెషర్‌కుక్కర్‌ బాంబ్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. సుక్మా జిల్లాలో కూంబింగ్​ నిర్వహిస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్​ బాంబు పేలింది. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్​ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్​ చౌహాన్ ధృవీకరించారు. సుక్మా జిల్లా చింతలనార్​ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయిగూడలో బెటాలియన్​ నంబర్​ 24 డీఆర్జీ బేస్ క్యాంప్‌నకు చెందిన జవాన్లు ఏరియా డామినేషన్​ కోసం ఉదయం కూంబింగ్‌ కోసం ​కు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు కూంబింగ్‌కు వచ్చే మార్గంలో ప్రెషర్​ బాంబును అమర్చారు. 11 గంటల ప్రాంతంలో పొడియం వినోద్​ అనే జవాన్​ ప్రెషర్ బాంబును తొక్కగా, అది పేలడంతో అతని పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన జవాన్లు ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వినోద్‌ను ​ను రాయిగూడ బేస్​ క్యాంప్‌ కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా, మావోయిస్టుల కోసం జవాన్లు రాయిగూడ అడవుల్లో కూంబింగ్​ ముమ్మరం చేశారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com