24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

సారంగపాణి జాతకం టీజర్ విడుదల

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ‘సారంగపాణి జాతకం’ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు(గురువారం) సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.

‘సారంగపాణి జాతకం’ విషయానికి వస్తే… హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, ఆ జాతకాలపై నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com