విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించామని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు. వందశాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వివరించారు.
మొదటి ఫేజ్ లో 46.2 కి మీ లతో మూడు కారిడార్ల నిర్మాణం చేపడతామని, మొదటి ఫేజ్ లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ కారిడార్స్ లో హనుమంతు వాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయన్నారు.
ఈ ప్రాంతాలలో 8 మీటర్ల ఫ్లై ఓవర్, దానిపైన మెట్రో నిర్మాణం చేయమని ప్రతిపాదనలు పంపామని, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు.