29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

మలక్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ కింద అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ కింద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెట్రోస్టేషన్‌ కింద పార్క్‌ చేసిన ఓ బైక్‌లోంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ పక్కనే ఉన్న మిగతా బైక్‌లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో, అక్కడున్న ఐదు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు.. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. పైన మెట్రో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది, ప్రయాణీకులు కూడా దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

 

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com