32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

భట్టి విక్రమార్క పాదయాత్రను గుర్తుచేసిన మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభలో అతిథులను ప్రస్తావిస్తూ.. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం అయ్యిందని, యేడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో సభ నిర్వహించడం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సా మంత్రులు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్లందరికీ జిల్లా వాసుల తరపున స్వాగతం పలికారు. అదే సమయంలో.. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. తన పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా పరిధిలోని ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల మీదుగా హ హుజురాబాద్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించారని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి తనదైన పాత్ర పోషించారని కొనియాడారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com