అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ తన పదవినుంచి దిగిపోయే సమయంలో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే అంటూ మండిపడ్డారు. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో హంటర్‌బైడెన్‌ను దోషిగా తేల్చారు. అంతేకాదు.. పలు ఇన్‌కమ్ టాక్స్ నిబంధనలు కూడా ఉల్లంఘించారని హంటర్‌పై అభియోగాలున్నాయి. దీంతో, కుమారుడు హంటర్ బైడెన్‌ను జైలు శిక్ష నుంచి తప్పించేందుకు కొద్దిరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చట్టం ముందు అందరూ సమానమే అంటూ బైడెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.