33.2 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

ఫుట్ బాల్ కథాంశంతో మూడు భాషల్లో “డ్యూడ్”

యువనటుడు తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న వినూత్న త్రిభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్… ఈ చిత్రానికి ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం.

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ -2025 విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

“శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష” తదితరులు ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు!!

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!! ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన కన్నడ సూపర్ స్టార్ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తుండడం విశేషం.

ఈ చిత్రానికి “జింకే మారి” ఫేమ్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా… “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com