37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్‌ 6న బీజేపీ బహిరంగసభ

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. డిసెంబర్ 6వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ సభకు పార్టీ జాతీయస్థాయి నేతలు హాజరవుతారని తెలిపారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో సంస్థాగత ఎన్నికలపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్త రక్తం పార్టీలో చేరబోతోందన్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయి స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని సాక్షాత్తూ ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. మనల్ని ధైర్యంగా ముందుకి వెళ్ళాలని ప్రధాని భరోసా ఇచ్చారని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో ముందుకి వెళ్తామని ప్రకటించారు. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, జిల్లా వారీగా చార్జి షీట్ తయారు చేసి విడుదల చేస్తామన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com